Followers

Tuesday, 11 April 2017

Heartfull words from Vyaghreswaram people

కొంచెం ఎటకారం ఇంకొంచెం చమత్కారం మనుషులంటే మమకారం అందరిని ప్రేమించే సంస్కారం ఇదే మన వ్యాఘ్రేశ్వరం....... బంధాలకు విలువిస్తాం బందువులను ఆదరిస్తాం అతిదుల్ని గౌరవిస్తాం ఆతిధ్యాన్ని అందిస్తాం పండగొస్తే పది మందిని పోగేసుకుంటాం ఇంట్లో సందడి అందరితో పన్చేసుకుంటాం పెద్దలంటే మర్యాదిస్తాం కలిసి మెలిసి స్నేహం చేస్తాం తారతమ్యాలు వదిలేస్తాం సాంప్రదాయాలు పాటిస్తాం మాటకు నిలబడతాం పరువుకు ఎగబడతాం నచ్చితే ఎవరినైనా నెత్తినపెట్టుకుంటాం నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తాం అందాలు, ఆనందాలు ఆస్వాదిస్తాం సరదాలు, సంతోషాలు స్వీకరిస్తాం అన్ని విద్యలు నేర్చిన వాళ్ళం అన్ని కళలు తెలిసిన వాళ్ళం మాటలతో మమతలు పెంచుతాం ఎక్కడున్నా ఎదుటి మనిషి మనసును గెలుస్తాం మన ఊరు... గౌరవాలు పుట్టిన ఊరు మర్యాదలకు పెట్టింది పేరు... అందుకే... ఏమండి.... అంటూ ఎద లోతుల్లోంచి ఆప్యాయంగా పలకరిస్తాం బాగున్నారా....! అంటూ బాగోగులు చూసుకుంటాం ఆస్థులు ఉన్నా లేకున్నా , విలువలు తెలిసిన వాళ్ళం విలువలు పంచేవాళ్ళం ,విలువలు పెంచేవాళ్ళం అందుకే... అది, మన వ్యాఘ్రేశ్వరం.... మన ఊరి అందాలు... గలగలా పారే గోదారి సెలయేరు రెప రెప లాడుతూ పిల్ల గాలి సవ్వొళ్ళతో కదిలే అందాల ఆకుపచ్చ వరి పైరు చెంగు చెంగున ఎగిరే లేగ దూడ పరుగులు ప్రతిరోజూ కొత్తగా కనిపించే ప్రకృతి అందాలు పాడి పంటలు, వసంతాన కూసే కోయిల పిలుపులు, పసందైన పిండి వంటలు, పూతరేకులు, తాటి ముంజులు, కొబ్బరి చెట్ల అందాలు, మనసు దోచే దృశ్యాలు.. పండగలొస్తే పందిళ్లు, ముంగిట ముగ్గుల లోగిళ్లు మన వూరొచ్చే అల్లుళ్లు, అల్లరి చేసే మరదళ్ళు, వాళ్ళు చేసే సందళ్ళు, సంతోషాల పరవళ్లు, సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకిస్తాం...... సమరమైనా, సరసమైనా శక్తినంతా పోగేస్తాం విజయ దుందిభిః మోగిస్తాం. మారుతున్న ప్రపంచంతో పరుగులు పెడుతుంటాం.... మనం ఇలానే ఉందాం.. మనం ఇలానే ఉందాం.. ఎందుకంటే మనది వ్యాఘ్రేశ్వరం.... ఇక్కడ ఉండటం ఆ వ్యాఘ్రేశ్వరుడు మనకిచ్చిన వరం...

No comments:

Post a Comment