Followers

Tuesday, 3 January 2017

శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామీ దేవాలయము


శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామీ.దేవాలయము 
వ్యాఘ్రేశ్వరం గ్రామము .అంబాజీపేట మండలం. తూ.గో.జిల్లా 
 ప్రాంతము పూర్వకాలములో అడవీ ప్రాంతం గా ఉండేది .ఆరోజులలో ఒక భ్రాహ్మణుడు శివరాత్రి పర్వదినాన మారేడు పత్రీ ,మరియు సమిధలకై అడవిలోనికి వెళ్ళగా అతనిని ఒక పెద్దపులి తరుముతూ వెళ్ళగా ఆ బ్రాహ్మణుడు మారేడు చెట్టుపైకి ఎక్కి కుర్చుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఎంతకు ఆ పులి చేట్టుక్రిండనుండి వెళ్ళలేదు . శివరాత్రి నాడు శివునికి మారేడు పత్రి పూజా ,అభిషేకము చేయలేక పోతున్నామని విచారిస్తూ ఒక్కొక్క మారేడుపత్రము కోసి క్రింద నున్న పులి పై వేస్తూ రాత్రి అంతా ఆ బ్రాహ్మణుడు గడిపి ఉదయాన క్రింద చూడగా మారేడు పత్రీ క్రింద పులి కనిపించక పోవుటచే మెల్లగా చేట్టుదిగి రాజుగారివద్దకు పోయి విషయము చెప్పగా రాజుగారు అచటకు వచ్చి మారేడు పత్రీ తొలగించి చూడగా శివలింగము కనిపించినదట. వ్యాఘ్రరూపమున వెలసిన శివుని రాజు గారు అక్కడే ప్రతిష్టించగా అప్పటినించీ స్వామిని వ్యాఘ్రేశ్వర స్వామి గా పిలవబడుచు ప్రసిద్ది గాంచినారట.భక్తులు వ్యాఘ్రేశ్వర స్వామివారికి నారికేళ జల అభిషేకము ,లక్ష బిల్వార్చన చేయుట బహు పుణ్య ఫలమని భావించి పూజించి తరిస్తారు. 














ఈ స్వామికి చాలా లక్ష బిల్వార్చనలు జరుగుతాయి . భక్తులు మ్రోక్కుకుని కొబ్బరి మొక్కలను స్వామికి సమర్పించుకుంటారు
ఈ ప్రాంతం లో బహుళ ప్రాచుర్యము పొందిన పురాతన శివాలయము.
రాజఃమండ్రీ - అమలాపురం బస్సు రూటులో పుల్లేటికుర్రు లో బస్సు దిగి ఆటో లో వ్యాఘ్రేశ్వరము లోని శివాలయమునకు వెళ్ళవచ్చును
అమలాపురమునకు 15 కి.మీ.దూరములోను ,రాజమండ్రీ కి 65 కి.మీ. దూరములోను ఈ క్షేత్రము కలదు.
గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతమునకు వచ్చు భక్తులు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామిని దర్శించి తరించండి ..

No comments:

Post a Comment