Followers

Thursday, 29 December 2016

Kanipaka Vinayaka Story

విఘ్నాధిపతి వినాయకుడు అనగానే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలోని “కాణిపాకం” ఆలయం. వినాయకుడు వెలసిన క్షేత్రాలలో ప్రధానమైంది ఈ ఆలయమే. కాణిపాకం అంటే “వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు” అని అర్ధం. అలాంటి ప్రసిద్ది చెందిన దేవాలయం వెనుకున్న చరిత్ర తెలుసుకుందాం.

* ఇప్పుడు ఆలయం ఉన్న భూమి ముగ్గురు అన్నదమ్ములకు చెందిన వ్యవసాయ భూమి. వారిలో ఒకరు మూగ, మరొకరు చెవిటి, ఇంకొకరు అంధుడు. కొంతకాలం తర్వాత బావిలో నీరు ఎండిపోవటంతో.. వారు బావిని తవ్విస్తారు. బావిని తవ్వుతూ ఉండగా ఒక గట్టి రాయి తగిలినట్టు వారికి అనిపిస్తుంది. క్షణాలలోనే రక్తం ఊరడం, బావి నిండిపోవడం జరుగుతుంది. దీంతో బావిలో మహత్యం ఉందని భావించి పరిశీలించి చూడగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. అప్పటినుండి భక్తులందరు పూజలు చేయడం మొదలుపెట్టారు.
* 11వ శతాబ్దంలో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ప్రతిష్టించినది కాదు. వర సిద్డి వినాయకుడు అక్కడ వెలిసాడు. అందుకే కాణిపాక వినాయకుడిని “స్వయంబు” అంటారు.
* ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే… విగ్రహ పరిమాణం రోజురోజుకి పెరుగుతూ ఉండటం. 50 ఏళ్ల కిందట కానుకగా ఇచ్చిన వెండి కిరీటం ఇప్పుడు సరిపోకపోవడమే దీనికి నిదర్శనం.

No comments:

Post a Comment